Thursday, 26 May 2016

మనిషి 
+++++  
మాయ మవ్వలేదు మనిషి 
మనిషిని దోచుకు తింటు మనిషి 
బతుకుతున్నడు చూడు మనిషి 
ఇది రోజు జరుగుతున్నతంతే 
అయినా ?మనిషి మారలేదు అంతే !
ప--ఉమ్మనీటిలో  పెరిగే మనిషి 
     తల్లి తిన్నదే తాను తింటు 
      ఎగిరెగిరి కడుపులో తంతు 
       తనువు చీల్చుకొని పుడుతు 
       రక్తాన్ని పీల్చుకు తాగుతు 
       అమ్మ నాన్నల శ్రమకమ్మగా తినిపెరిగి  
       కనిపెంచిన వాళ్ళ నే 
       తన్ని తరిమేస్తుండే చూడు !
ప --ఆస్తులే మనిషికి ముక్యమై 
      రక్తబంధమే రణ రంగమై 
      కుటుంబాలే తెగి ముక్కలై 
       అల్లాడి అల్లాడి చస్తుంటే 
       కడుపే ముక్యమని తలపోస్తు 
       మనిషిని మనిషే దోచుకు తింటుండే 
       మనిషి రాజై పాలిస్తు వున్నా 
       దోపిడే ముక్యం మనిషికున్న తత్వం !
                జైహింద్ 

Saturday, 30 April 2016

చరిత్రలో
ఇద్దరే
వర్దిల్లు తుంటారు !
ఒకడు మంచివాడు
మరొకడు చెడ్డవాడు 
ఎన్ని డబ్బులుంటే ఏం లాభం ?
గుప్పెడు మట్టి లేకుంటే
బుక్కెడు బువ్వ కరువే ?!

Monday, 4 April 2016

అక్షరాలు పైకి విసిరాను 
అవి నింగిలో 
మల్లెల్లా విచ్చుకున్నాయి !
అక్షరాలు నేల పైవిసిరాను 
అవి పుడమిపై 
తరువులై పలాలు పంచుతున్నాయి !
అక్షరాలు నాచేతిలో 
అమృత గీతికలే !
విజ్ఞాన విధాతలే !!

Friday, 18 March 2016

గుమ్మి 
--------
గుమ్మి మాఇంట్లో 
నాలుగు చతురస్ర 
ఆకారపు రాళ్ళపై 
చెక్కల పరుపు పరుచుకొని
చిన్న పర్వతంలా కూర్చుంది !
మాపొలంలో పండిన ధాన్యం
తన పొట్టనిండా నింపుకొని
పైన పేడ దుప్పటి కప్పుకొని
హాయిగా నిద్రపోయింది !
కడుపు నిండిన గుమ్మి
రాజహాసం చూస్తుంటే
మాఇంట ఏ దాదిపాటు
ఏ కరువు లేదు !
ఇంటిల్లిపాది
తృప్తిగా భోంచేస్తూ
సుఖంగా ఉండేది !
గుమ్మి అంటే రైతు
గుండెకా యనే !
అందుకే ఇల్లాలు
పసుపు కుంకుమల తోటి
గుమ్మికి పూజించి
వేడుకొని మ్రొక్కేది !
అన్నం పరబ్రమ్మం !
రైతు సూక్తినే కదా !
దాన్య రాశులకు గుమ్మి
ధనాగారం వలే
రైతింట వర్దిల్లె !
పల్లె పల్లెలో నేడు
రైసు మిల్లులు వెలసి
గుమ్ములను మింగేసే!
గుమ్మి అంటే ఏంటో
నేటి తరంకు తెలుసా ?
జైహింద్

Friday, 12 February 2016

మృత్యువు
--------------
తల్లి గర్భంలోన 
మొలకెత్తినప్పుడే 
నీడలా మృత్యువు 
నీతోనే పుడుతుంది !
క్షణం క్షణం అది 
నిన్ను మింగాడానికి
 నోరు బారుగ తెరచి
కోరలు ముందుకు ఛాచి
నీమీద పడుతుంది !
మృత్యువు దాడి కని
లౌక్యం తోఎదిగితే
మృత్యుం జయుడవే !
నవమాసాల పిదప
గర్భలోకం వీడి
పుడమి పడిననిన్ను
వదలక మృత్యువు
నీవెంట వస్తుంది !
దినదిన గండాల
మృత్యువును మోస్తూ
బతుకు సమరంలోన
సాగుతున్నా నిన్ను
నరకయాతన పెడుతూ
అవకాశం కోసం
దాడికై వేచి వుండు !
సమస్యల వ వలయంలో
బతుకంతా అలసి
చిక్కి శల్యమై
కృంగి కృషిస్తే చాలు
మృత్యువు నీపై
పైచేయి సాదించి
హతమార్చి నిన్ను
విజయానంద మొందు !
జననం మృత్యువు
కలసి కట్టుగ సాగే
అనుబంధ బంధము !
విడదీయ లేరెవరు
జనన మృత్యువు
అనుబంధాన్ని
కలసిసాగవలె
ఊ పిరి ఉన్నంతవరకు !!
       జైహింద్

ఆకుల రాఘవ ,
9440971792.