Sunday, 1 February 2015

పురిటి నొప్పుల జాడ
నేటి గర్భిణి లకు లేదు
కత్తెర కోతలతోనే
పురుడు పోసుకొనే రాఘవ !!

Friday, 23 January 2015

ఎండను కమ్మగా తిని
వానను తియ్యగా తాగి 
చలిని వెచ్చగా కప్పుకొని 
పవన తేరుపై ఊగు తున్నవు రాఘవ !
ఇళ్ళు శుభ్రత ఈశ్వరుడు మెచ్చు !
వీధి శుభ్రత విష్ణువు మెచ్చు !
దేశం శుభ్రత ధన లక్షిమి మెచ్చు !
శుభ్రతే సిరులు రాఘవ !

Sunday, 28 December 2014

ప్రేమ విలాపం
--------
చూపుల బడిలో కలిశాము !
కనుసైగల తరగతిలో చదువుకోవాలంటే
ఉపాధ్యాయులతో భయము !
బస్టాపుల్లో పలకరించు కుందామంటే
పోకిరి యెదవలతో భయము !
పార్కుల్లో పాటాలు నే ర్చు కుందా మంటే
పార్కుల్లోకి వచ్చే ప్రజలతో భయము !
ఆలయాల్లో ఆలోచించ్చు కుందామంటే
ఆలయాలకు వచ్చే భక్తులతో భయము !
లాడ్జీల్లో లాలింఛు కుందామంటే
పోలీసుల సోదాలతో భయము!
ఇళ్ళల్లో ఇష్టా ఇష్టాలు తెలుసుకుందామంటే
తల్లి దండ్రులతో భయము!
మరి మేమెక్కడ కలుసుకోవాలి ?
ప్రేమ పాటాలు ఎలా నేర్చుకోవాలి!
మనసు లోతుల్లోని మర్మాలు ఎలా తెలుసుకోవాలి?
స్పర్ష ల స్పందనలు   ఎలా తెలుసుకోవాలి?
గుండె లయల గుట్టును ఎలా కనిపెట్టాలి ?
ఏడడుగుల బాటలో
జతగా నూరేళ్ళు నడవాలికదా ?
కలుసుకోలేని సందిగ్దంలో
అర్తంకాని అవస్తలతో
విరహ వేదనలతో
విల విల లాడి పోతున్నాం !
ప్రభుత్వమా ?!
కులానికి ఒభవనము
మతానికి ఒభవనము
నిర్మించ్చి ఇచ్చి నట్లే
ప్రేమికులకు ఒభవనము
ప్రేమికులకు ఒపార్కు
నిర్మించ్చి ఇవ్వండి!
మేము రేపటి తరాన్ని
అభివృద్ధి పరిచే వారసులము !
మాప్రేమ విలాపాన్ని
విన్నవించుకుట్టున్నాము !
ఇదే మాప్రేమ ప్రార్థన !!
జైహింద్