Akula Raghava Poet
Friday, 6 December 2013
విద్య కలిగిన వాడు
విజ్ఞాని ఐతే
విద్య లేనివాడు
విజ్ఞాని యేరా !
శ్రమను వెలిగిస్తూ
బతుకు తువుంటాడు !
అడుగు తో ఆరంభం !
ఏ డడుగుల తో సంబంధం !
ఆరడుగులతో అంతం !
అదేమనిషి జీవితం !
Sunday, 27 October 2013
కలం
ఉలి
కుంచె
సృష్టిని
ప్రతిసృష్టి
సెసేసాదనాలు
వాటినివాడే
నైపుణ్యంగలవాడే
విధాత !
కళ్ళు
----
కనుచూపు మేరకే
చూస్తాయి
మనోనేత్రాలు
ముల్లోకాలను
చూడగలవు !
Tuesday, 22 October 2013
కాశీ
----
భక్తిని తాగుతుంది
విషాన్ని విసర్జిస్తుంది !
గంగాజలం
ఎప్పుడు
అమృత జలం అవుతుందో ?!
Friday, 27 September 2013
సూర్య రశ్మి ప్రతాపం
వాతావరణ లోపం
తెలుపు,ఎరుపు,నలుపు
మానవవర్ణాల
అంకురార్పనకు మూలం!
మనుషులకేందుకు వర్ణవివక్ష ?
మనుధర్మ సూత్రాలేందుకు దండగ ?
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)