Sunday, 27 October 2013

కళ్ళు
----
కనుచూపు మేరకే
చూస్తాయి
మనోనేత్రాలు
ముల్లోకాలను
చూడగలవు !

Tuesday, 22 October 2013

కాశీ
----
భక్తిని తాగుతుంది
విషాన్ని విసర్జిస్తుంది !
గంగాజలం
ఎప్పుడు
అమృత జలం అవుతుందో ?!

Friday, 27 September 2013

సూర్య రశ్మి ప్రతాపం 
వాతావరణ లోపం 
తెలుపు,ఎరుపు,నలుపు 
మానవవర్ణాల 
అంకురార్పనకు మూలం!
మనుషులకేందుకు వర్ణవివక్ష ?
మనుధర్మ సూత్రాలేందుకు దండగ ?

Sunday, 18 August 2013

అబివృద్ధి
--------
కాలే కడుపుల
పునాదుల మీద
వృద్ధి చెందేది !
-------
జీవితం
-----
కాలంపెట్టే
పరీక్షలో
 ఉత్తిర్ణమైతే
విజయం!

Monday, 5 August 2013

తిండి కలిగితే కండపెరుగు
కండపెరిగితే కొవ్వుపెరుగు
కొవ్వుపెరిగితే గుండె ఆగు !

Thursday, 25 July 2013

మట్టినితోడితే
నీరుపొంగుతుంది !
జీవితాన్ని తోడితే
అనుభూతులుపొంగు !