Sunday, 18 August 2013

అబివృద్ధి
--------
కాలే కడుపుల
పునాదుల మీద
వృద్ధి చెందేది !
-------
జీవితం
-----
కాలంపెట్టే
పరీక్షలో
 ఉత్తిర్ణమైతే
విజయం!

Monday, 5 August 2013

తిండి కలిగితే కండపెరుగు
కండపెరిగితే కొవ్వుపెరుగు
కొవ్వుపెరిగితే గుండె ఆగు !

Thursday, 25 July 2013

మట్టినితోడితే
నీరుపొంగుతుంది !
జీవితాన్ని తోడితే
అనుభూతులుపొంగు !
విజ్ఞానం విస్తరిస్తే 
అజ్ఞానం కళ్ళు తెరుస్తుంది !

Friday, 12 July 2013

రాజ్యం
బలవంతుడి చేతిలో
ఆటబొమ్మ !
తను ఎలాడిస్తే
ఆలాడుతుంది !
ప్రజలంతా ప్రేక్షకులే !

Tuesday, 11 June 2013

వర్షం 
రైతుకు వరం 
వర్షం 
వ్యాపారికి నష్టం !