Monday, 5 August 2013

తిండి కలిగితే కండపెరుగు
కండపెరిగితే కొవ్వుపెరుగు
కొవ్వుపెరిగితే గుండె ఆగు !

Thursday, 25 July 2013

మట్టినితోడితే
నీరుపొంగుతుంది !
జీవితాన్ని తోడితే
అనుభూతులుపొంగు !
విజ్ఞానం విస్తరిస్తే 
అజ్ఞానం కళ్ళు తెరుస్తుంది !

Friday, 12 July 2013

రాజ్యం
బలవంతుడి చేతిలో
ఆటబొమ్మ !
తను ఎలాడిస్తే
ఆలాడుతుంది !
ప్రజలంతా ప్రేక్షకులే !

Tuesday, 11 June 2013

వర్షం 
రైతుకు వరం 
వర్షం 
వ్యాపారికి నష్టం !

Wednesday, 5 June 2013

సముద్రం విషం
వర్షం అమృతం !
గాలిచిలుకుతుంది
విషాన్ని అమృతంగా !

Friday, 10 May 2013

ప్రపంచం
గుప్పెడైంది !
పలుకు
బారెడైంది !
బంధాలన్నీ
గాలిలోనే !!