Wednesday, 24 April 2013

నింగిలో నిప్పు
నీటిలో నిప్పు
వాడే విదం బట్టి
మండుతూ
ఉంట్టుంది !

Saturday, 20 April 2013

కావడి
కాలం
రోజుల
మోస్తుంది !
మనిషి
బతుకును
మోస్తుంది !

Sunday, 31 March 2013

పట్నం ఇరుకుల గల్లీ
కుమ్మరి వాంలో కుండలు
కాలిపోతున్నట్లు
కాలుష్యపు కంపుతో
కాలిపోతువున్నది !

Friday, 29 March 2013

మతాది పతులు
భక్తులకు
బతుక నేర్పాలి !
దేవుళ్ళ మహిమలుకాదు ?
సేద్యమంటేనే రైతు 
కంటతడి పెడుతున్నాడు !
రియల్టర్ పంటభూమూలు 
ప్లాట్స్ చేసి 
కోట్లు గడిస్తున్నాడు !
మాటలు నేర్చినవాడు
నగరంలో మహారాజు !
మాటలు రానివాడు
నగరంలో ఒంటెద్దు !

Saturday, 23 March 2013

          శ్రమ సౌందర్యమే సంగీతము
         -------------------------పాట
మట్టిలో రాగాలు తియ్యంగా
గింజలే మొలకెత్తి మురువంగా 
రాళ్ళల్లో తాళాలు వేయంగా
అవి బొమ్మలై నాట్యమాడంగా
శ్రమ సౌందర్యమే సంగీతం
బ్రతికేటి ప్రాణుల కానందం
     తొలిపొద్దు కిర ణాల రాగాల్లో
     చిరుగాలి తాళాల నాదాల్లో
     ఆమని మేల్కొని హాయీ గా ఆడంగా
     జగతి జనులంతా దిన చర్య మొదలెట్టే
     స్రమలోని పలితాలు ఆకలి తీర్చంగా
     ఆనంద మానందమే జగమంత ఆనందమే
కెరటాల నాట్యాల తుళ్ళింత లో
మేఘాల మెరుపుల కవ్వింతలో
ముత్యాల జల్లులు పువ్వులై పొంగగా
మట్టిలో గింజ్జలు నేల తన్నుకొని
తల ఎత్తి ఆడుతూ పచ్చదనం పంచె
పచ్చదనమే జగతి జనుల బతికించు
         జైహింద్