ఒంటికంటిన దురద
మందుతో పోతోంది
మన సుకంటిన దురదకు
మందేలేదు !
Saturday, 16 March 2013
జంతువులకు పక్షులకు
సరిహద్దులు లేవు
వీసాల గుర్తింపు లేదు
మానవుడి కెందుకు
సరి హద్దుల కట్టుబాట్లు ?
వీసాల గుర్తింపు ?!
సూర్యుని ఎండను రా యీ
ఎదలో కప్పుకోను
ఆరా యీ ని గిల్లిచూ డు
నిప్పు రవ్వలురాలు !
చెట్టు మొదలు నరికితే
తిరిగి జీవం పోసుకుంట్టుంది !
మనిషి తలనరికితే
తిరిగి జీవం పోసుకోగలడా ?!
Saturday, 23 February 2013
అడుగు
ముందుకేస్తే
జయం !
అడుగు
వెనక్కి వెస్తే
అపజయం !
Saturday, 2 February 2013
చూపులు
ప్రశాంతంగా
ఉండాలి !
మాటలు
మధురంగా
ఉండాలి !
నడత
న్యాయంగా
ఉండాలి !
అట్టివాడే మనిషి !
కాలం పొడవు
బతుకు కురుచ
ఐనా ?
బతుకంతా
పోరాడాలి!
Friday, 25 January 2013
కవిత
------
గుడి
నిన్ను నువ్వు
గుర్తుచేసుకోవడానికి !
మసీదు
నిన్ను నువ్వు
మలచుకోవడానికి !
చర్చీ
నిన్ను నువ్వు
చక్కదిద్దుకోవడానికి !
మతాల
మారణహోమం
సృష్టించడానికి కాదు ?